గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

నిధి అగర్వాల్‌కు లక్కీ ఛాన్స్... ఏంటది?

ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్‌ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నట్టు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
ఈ ముద్దుగుమ్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి సవ్యసాచి అనే చిత్రం ద్వారా అడుగుపెట్టింది. ఈ చిత్రం పూర్తిగా నిరాశపరిచింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ - రామ్ కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఈ అమ్మడు రేంజ్‌ను ఒక్కసారిగా పెంచేసింది. ఇదే ఆమెకు తొలి విజయం. 
 
ఈ క్రమంలో తాజాగా ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే బిగ్ ఆఫర్‌ను అందుకున్నట్టు వార్తలొస్తున్నాయి. క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఓ పిరీడ్ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే హైదరాబాదులో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగు కూడా మొదలైంది. 
 
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ ఓ కథానాయికగా నటించే అవకాశాన్ని సొంతం చేసుకుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈమె ఈ చిత్రం షూటింగులో కూడా పాల్గొందని అంటున్నారు. ఈ సినిమాలో మరో కథానాయికగా బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుందని సమాచారం.