శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2016 (19:23 IST)

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో నిహారిక.. ఎందుకో తెలుసా?

ఒక మనసు ఫేమ్ హీరోయిన్, నాగబాబు కుమార్తె నిహారిక రెండో సినిమాపై దృష్టి పెట్టింది. ఒక మనసు ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టకపోవడంతో నిహారిక బాగా హర్ట్ అయ్యింది. ఇంకా తన సినిమా ప్రమోషన్‌లో మెగాస

ఒక మనసు ఫేమ్ హీరోయిన్, నాగబాబు కుమార్తె నిహారిక రెండో సినిమాపై దృష్టి పెట్టింది. ఒక మనసు ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించిపెట్టకపోవడంతో నిహారిక బాగా హర్ట్ అయ్యింది. ఇంకా తన సినిమా ప్రమోషన్‌లో మెగాస్టార్ చిరంజీవి పాలుపంచుకోకపోవడంతోనే తన సినిమా ఫట్ అయ్యిందని నిహారిక భావిస్తోంది. అందుకే తన పెదనాన్న చిరంజీవి నటిస్తోన్న 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో తనకు కూడా నటించాలనుందని గతంలో వెల్లడించింది.
 
ఒక మనసు ప్రమోషన్‌లో పాలుపంచుకోలేని చిరంజీవి తన కుమార్తె కోరిక కాదనలేక నిహారిక కోసం గెస్ట్ రోల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. దీనికోసం ఓ సీన్ రాయమని దర్శకుడు వీవీ వినాయక్‌తో కూడా చిరంజీవి చెప్పేసినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. చిరంజీవి సినిమాలో అప్పట్లో నటించిన అల్లు అర్జున్  స్టైలిష్ స్టార్‌గా ఎదిగిన తరుణంలో తాను కూడా టాప్ హీరోయిన్‌గా మారాలని నిహారిక ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసమే అన్నయ్య 150వ సినిమాలో నటించాలని పట్టుబట్టింది. ఇందుకు చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 
 
నీహారికతో పాటు సినిమాలో ఒక పాటలో సాయిధరం తేజ్ కూడా కనిపించనున్నాడని టాక్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. కాజల్‌కు చిరంజీవికి మధ్య వచ్చే సన్నివేశాలను త్రీకరిస్తున్నారు. త్వరలోనే నిహారిక కూడా షూటింగ్‌లో పాల్గొంటుందని సినీ వర్గాల సమాచారం.