శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 సెప్టెంబరు 2022 (22:45 IST)

సౌత్ గంగూభాయ్.. ఎవరో తెలుసా? ఫోటో వైరల్

Gangu
Gangu
టాలెంటెడ్ డైరెక్టర్‌ సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన గంగూభాయ్ సినిమాలో అలియాభట్ వైట్ అండ్ వైట్ చీరకట్టులో బ్లాక్ గాగుల్స్ పెట్టుకుని కనిపించే సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. కాగా ఇపుడు ఓ టాలీవుడ్ నటి గంగూభాయ్ కథియావాడిలా మారిపోయింది. 
 
కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉంటున్న నిహారిక నిర్మాతగా మారింది. అయితే ఆదివారం రాత్రి తన ఫ్రెండ్‌, యాంకర్ నిఖిల్ పుట్టినరోజు వేడుకలకు నిహారిక హాజరైంది. 
 
బర్త్ డే ఈవెంట్‌లో మూవీ థీమ్‌ను ప్లాన్ చేశారు. ఇందులో భాగంగానే నిహారికకు గంగూభాయ్ థీమ్ వచ్చింది. ఇక వెంటనే అలియాభట్‌ను మరిచిపోయేలా గంగూభాయ్ కథియావాడి లుక్‌లోకి మారిపోయింది నిహారిక. తెలుపు రంగు చీరలో, నల్ల కళ్లద్దాలతో గంగూభాయ్‌ను అచ్చు గుద్దేసినట్టు తయారైంది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.