ప్రభుదేవాను సర్ అని పిలుస్తా.. ఎవ్వరినీ పెళ్లి చేసుకోవట్లేదు: నికీషా పటేల్

ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ప్రభుదేవా తనకు శ్రేయోభిలాషి మాత్రమేనని.. ఆయన్ని తాను సర్ అని పిలుస్తానని నికీషా పటేల్ తెలిపి

nikisha patel
selvi| Last Updated: ఆదివారం, 13 మే 2018 (15:39 IST)
ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకోలేదని.. ఆయన తనకు మంచి స్నేహితుడని చెప్పింది. ప్రభుదేవా తనకు శ్రేయోభిలాషి మాత్రమేనని.. ఆయన్ని తాను సర్ అని పిలుస్తానని నికీషా పటేల్ తెలిపింది. ప్రభుదేవాతో కలిసి నటించడం ఏంటి.. ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమని నికీషా పటేల్ చెప్పినట్లు వార్తలొచ్చాయి. 
 
దీనిపై నికీషా పటేల్ స్పందిస్తూ.. తాను ప్రభుదేవాను కాదు ఎవ్వరినీ పెళ్లి చేసుకోవట్లేదని క్లారిటీ ఇచ్చింది. కాదా పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు జోడీగా ''కొమరం పులి'' చిత్రంతో టాలీవుడ్‌ పరిశ్రమకు నికీషా పటేల్ పరిచయమైంది. 
 
ఓమ్, అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్‌ 2 తదితర చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో దాదాపు 25 చిత్రాల్లో నటించిన నికీషా ప్రస్తుతం ''తేరీ మెహర్బానియా 2" అనే బాలీవుడ్‌ చిత్రంలో నటిస్తోంది.దీనిపై మరింత చదవండి :