నితిన్‌తో రష్మిక.. కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకోలేదు.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Rashmika Mandanna
Last Updated: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (10:37 IST)
ఛలో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి వ‌చ్చింది మంద‌న్న‌. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో న‌టించిన‌ గీత గోవిందం గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆ త‌ర్వాత నానితో న‌టించిన దేవ‌దాస్ ఫ్లాప్ అయిన కూడా ఆమె కెరీర్ మీద పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేదు. ఇక ఇప్పుడు త‌న ల‌క్కీ కోస్టార్ విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో న‌టిస్తుంది‌. 
 
ఇప్ప‌టికే సొంత ఇండ‌స్ట్రీ కన్నడలోనూ వ‌ర‌స సినిమాలు చేస్తూ ర‌చ్చ చేస్తున్న ర‌ష్మిక‌.. ఇప్పుడు త‌న ఫోక‌స్ త‌మిళ్ ఇండ‌స్ట్రీపై మ‌ళ్లించింది. గణేష్‌, కన్నడ నటుడు రష్మిక మందన జంటగా నటించిన కన్నడ చిత్రం చమక్ త్వరలో విడుదల కానుంది. ఈ సినిమాకు సుని దర్శకత్వం వహించారు. తెలుగులో గీతా.. చలోపేరుతో మామిడాల శ్రీనివాస్‌, దుగ్గివలస శ్రీనివాస్‌ విడుదల చేస్తున్నారు. 
 
ఇంకా కార్తి సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది ర‌ష్మిక‌. భాగ్యరాజ్ కన్నన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఎస్ఆర్ ప్రభు నిర్మాత‌. ఇప్ప‌టికే కార్తితో ఈయ‌న ఖాకీ సినిమాను నిర్మించాడు. ఇది రెండో సినిమా. ఈ చిత్రంతోనే ర‌ష్మిక ఊపిరి ఫేమ్ కార్తీతో త‌మిళ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం అవుతుంది.
 
ఈ నేపథ్యంలో తెలుగులో నితిన్ సరసన నటించేందుకు రష్మిక సిద్ధమైంది. నితిన్ చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు వున్నాయి. ఈ మూడింటిలో ముందుగా ఆయన 'భీష్మ' సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమాకి వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నాడు. 'ఛలో' సినిమాతో మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల, నితిన్‌తో చేసేది కూడా ప్రేమకథా చిత్రమే. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను తీసుకున్నారు.
 
మరో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్‌ను తీసుకున్నారనే వార్త రెండు మూడు రోజులుగా షికారు చేస్తోంది. తాజాగా ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందించాడు. ఈ సినిమాలో ఒక కథానాయిక మాత్రమే ఉంటుందనీ, ఆ పాత్రకి రష్మికను తీసుకోవడం జరిగిపోయిందని స్పష్టం చేశాడు. దీనిపై మరింత చదవండి :