బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

'భీమ్లా నాయక్' హీరోయిన్ ఇంట విషాదం

nitya menon
గత యేడాది వచ్చిన 'భీమ్లా నాయక్' హీరోయిన్ నిత్యామీనన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె ఎంతగానో ఇష్టపడే అమ్మమ్మను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేసింది. అలాగే, అమ్మమ్మతో కలిసివున్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. 
 
'ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. గుడ్‌బై అమ్మమ్మ. మై చెర్రీమ్యాన్‌ (తాతయ్య)ను బాగా చూసుకుంటాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా నిత్యాకు ధైర్యం చెబుతున్నారు. 
 
కాగా, 'అలా మొదలైంది' అనే చిత్రంతో తెలుకు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్.. సుధీర్ఘకాలంగా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. 'భీమ్లా నాయక్' చిత్రంలో ఆమె పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, ఎంతో మంది అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్‌ సిరీస్‌లతోనూ సిద్ధమవుతోంది.