బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2023 (15:56 IST)

'కుమారి శ్రీమతి'గా వస్తోన్న నిత్యామీనన్..

nitya menon
'కుమారి శ్రీమతి'తో నిత్యామీనన్ వస్తోంది. 'సిరి' పాత్రలో నిత్యా మీనన్ నటించిన కామెడీ-డ్రామా మాస్టర్ పీస్ వెబ్ సిరీస్ 'కుమారి శ్రీమతి' అద్భుతమైన స్నీక్ పీక్‌ను నటి కీర్తి సురేష్ ఆవిష్కరించారు. శ్రీనివాస్ అవసరాల రూపొందించిన స్క్రీన్‌ప్లేతో, ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రారంభమయ్యే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సెప్టెంబరు 21న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 
 
గోమ్టేష్‌ ఉపాధ్యే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ సెప్టెంబర్‌ 28న అమెజాన్‌ ప్రైమ్‌లో తెలుగుతో పాటు తమిళ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సిరీస్‌లో మొత్తంగా ఏడు ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. 
 
ఈ సిరీస్‌లో నిత్యా మీనన్‌తో పాటు నిరుపమ్‌, గౌతమీ, తిరువీర్‌, తాళ్లూరి రామేశ్వరి, నరేష్‌, మురళీ మోహన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి ఎంటర్‌టైన్మెంట్స్‌కు సంబంధించిన నిర్మాణ సంస్థ ఎర్లీ మాన్సూన్‌ టేల్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను నిర్మించింది.