శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2015 (18:42 IST)

17న నితిన్ కొత్త చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కొరియర్‌ బాయ్‌ కళ్యాణ్‌'. గురుఫిలింస్‌, మల్టీ డైమెన్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్త భాగస్వామ్యంలో రూపొందుతోన్న చిత్రం ద్వారా ప్రేమ్‌సాయి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ వాసుదేవమీనన్‌ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు. యామీ గౌతమి కథానాయిక. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు/ఏ సర్టిఫికెట్‌ లభించింది.
 
 
ఈనెల 17న ప్రేక్షకులముందుకు తెచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. గౌతమ్‌ మీనన్‌ మాట్లాడుతూ.. రొమాన్స్‌, యాక్షన్‌, కామెడీ, థ్రిల్లింగ్‌ అంశాలు మేళవించిన ప్రేమకథా చిత్రమిది. కళ్యాణ్‌ అనే ఓ సాధారణ కొరియర్‌బాయ్‌ జీవితంలో చోటుచేసుకున్న సంఘటన సమాహారమే ఈ చిత్ర ఇతివృత్తం. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. దర్శకుడు చక్కగా తీర్చిదిద్దారు. 
 
నితిన్‌ నటన, పాత్ర చిత్రణ సరికొత్త పంథాలో వుంటాయి. ఇటీవలే విడుదలైన గీతాలకు ఆదరణ లభిస్తోంది. కార్తీక్‌, అనూప్‌ రూబెన్స్‌ వీనులవిందైన బాణీలు అందించారు. సందీప్‌ చౌతా నేపథ్య సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తుంది. యువతరంతోపాటు కుటుంబ వర్గాలను అలరించే చిత్రమిదని' అన్నారు.