కిక్‌లోపించిన జబర్‌దస్త్ - అందుకు రాజకీయాలే కారణమా!
తెలుగులో లోగిళ్ళలో గురు, శుక్రవారాలు వస్తే చాలు జబర్‌దస్త్ ప్రోగ్రామ్‌తో టీవీలకు అతుక్కుపోతుంటారు పిల్లలు, పెద్దలు. ఒకప్పుడు ఇందులో చేసే స్కిట్లపై చాలా విమర్శలు వచ్చాయి. ద్వందార్థాలతో నడుస్తున్నాయంటూ మేథావులు విమర్శించారు. దానికి అప్పట్లో జడ్జిలుగా వున్న నాగబాబు, రోజాలు క్లారిటీ ఇస్తూ, వినోదంలో ఇది ఓ భాగమే. ఎక్కడా అసభ్యతకరంగా లేవని గట్టిగా చెప్పారు. తర్వాత పరిణామాల వల్ల పలు సంఘటలు చోటుచేసుకున్నాయి. నాగబాబు, రోజా ఇద్దరూ ఆ ప్రోగ్రామ్‌నుంచి తప్పుకున్నారు.
అయితే హైపర్ ఆది, సుధీర్‌లు ఇద్దరూ ప్రస్తుతం అందులో లేరు. ఆటోరాంప్రసాద్ ఒక్కడే వున్నాడు. కిందా మీదా పడుతూ ఏవేవే ప్రోగ్రామ్‌లు నడిపిస్తున్నాడు. అలాగే మరికొందరు నటులు కూడా దూరమయ్యారు. ఇందుకు జబర్‌దస్త్‌లో రాజకీయాలు కారణంగా పలువురు విశ్లేషిస్తున్నారు. ఆమధ్య కిరాక్ ఆర్పీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సుధీర్‌కు ఇక్కడ అవమానం జరిగిందని వెల్లడించాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిగిలిన ఆర్టిస్టులతో మల్లెమాల సంస్థ చాలా గొప్పది. పార్టిస్‌పెంట్లను బాగా చూసుకుంటారని కితాబిచ్చారు.
ఎన్ని కితాబులిచ్చినా ఇందులో నటించే నటీనటులకు ఏమంత ఆనందదాయకంగా లేదని తెలుస్తోంది. ఎపిసోడ్‌కు ఇంత డబ్బులు ఇస్తారని దానికోసమే వస్తున్నట్లు బయట చెప్పుకుంటున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు డైరెక్టర్లుగా వున్న ఇద్దరు వ్యక్తులు కూడా మానేశారు. క్రియేటివిటీ టీమ్‌లో మరో ఇద్దరు లేరు. కనుక ఆర్టిస్టుల్లోనే క్రియేటివిటీ చూపించి జబర్‌దస్త్‌ను రక్తికట్టించాలని చూస్తున్నారు. దాదాపు ఆది, సుధీర్ తప్పుకోవడంతో అప్పటినుంచి ఏమంత ఆశాజనకంగా ఎపిసోడ్స్ లేవు. అయితే ఇది శాశ్వతంకాదని, ప్రత్యామ్నాయంగా మరోటి చూసుకోవాలని రోజానే వారికి సూచించిందని తెలుస్తోంది. ఇందులో నటిస్తున్న నటీనటులు పలువురు స్వంత ఇల్లు కొనుగోలు చేసుకుని ఆర్థికంగా స్తిరపడ్డారు. అలాంటి మూలాలను మరిచిపోకూడదని కొందరు ఈ ప్రోగ్రామ్‌లో వుంటూ ఒకరకంగా సీరియల్‌గా సాగదీస్తున్నారు. ఇటీవల సర్వే ప్రకారం జబర్‌దస్త్ ప్రోగ్రామ్‌లో కిక్ లోపించిందని వెల్లడైంది. సో. ముందు ముందు ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాల్సిందే.