గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 ఆగస్టు 2022 (11:10 IST)

రోడ్డు ప్రమాదంలో చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ మృతి

road accident
ఉత్తరాంధ్ర మెగాస్టార్ చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్ యడ్ల లక్ష్మణ్‌యాదవ్(52) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విశాఖపట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృతి చెందారు.
 
వివరాల్లోకి వెళితే.. మధురవాడకు చెందిన లక్ష్మణ్‌యాదవ్ ఆర్టీసీ డ్రైవర్. జనసైనికుడిగా, ఉత్తరాంధ్ర చిరంజీవి అభిమానుల సంఘం కన్వీనర్‌గా ఉన్నారు. నిన్న విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరారు. 
 
ఈ క్రమంలో నగరంలోని జాతీయ రహదారిపై కొమ్మాది కూడలి వద్ద వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఆయన బైక్‌ను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. 
 
లక్ష్మణ్ యాదవ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలిద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. ఆయన మృతి విషయం తెలిసి చిరంజీవి అభిమానులు, జనసైనికులు, టీడీపీ, వైసీపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతికి నివాళులు అర్పించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.