శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2023 (16:54 IST)

నిర్మాతగానే కాకుండా థియేటర్ నిర్మాణం నా లక్ష్యం : జబర్దస్త్ గడ్డం నవీన్

Gaddam Naveen
Gaddam Naveen
సినిమాలకు వెళ్ళానుకున్నప్పుడు మా బాబాయ్ శ్రీను ప్రోత్సాహంతో ఓ చిన్న ఎంట్రీ దొరికింది. 'ప్రేమించేది ఎందుకమ్మా' సినిమాకి దర్శకులు సురేందర్ రెడ్డి ఆసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆ సమయంలో నా హెయిర్ స్టైల్ బాగుండే అప్పుడు.. సురేందర్ రెడ్డి గారు సెలెక్ట్ చేసి  అవకాశం ఇచ్చారు. మా వైఫ్ కూడా ఆర్టిస్ట్. అమెను కూడా ఫస్ట్ టైమ్ అక్కడే చూశాను.. సినిమా పూర్తియ్యేసరికి పేరేంట్స్‌కి తెలియకుండా పెళ్లిచేసుకున్నాం. ఈ విషయం తెలిసి సీరియస్ అయ్యారు.. కానీ తర్వాత అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు - అని జబర్దస్త్ గడ్డం నవీన్ అన్నారు.
 
చిన్న చిన్న వేషాలు వేసి 150 సినిమాలలో చేసిన గడ్డం నవీన్ జబర్దస్త్ అనే టీవీ ప్రోగ్రాం అతని కెరీర్ ను మార్చిసింది. ఆయా  తాజాగా మాట్లాడుతూ,  నిర్మాత కావాలనేదే నా లక్ష్యం. జబర్ధస్త్ నుంచి వేణు, శాంతకుమార్, అధిరే అభి, రాకింగ్ రాకేష్ దర్శకులుగా మారారు. మరికొంతమంది హీరోలు అయ్యారు. దానికి  ఎన్నో తెలివితేటలు కావాలి. కాబట్టి నేను నిర్మాతగా హిట్ కొట్టాలన్న‌దే నా లక్ష్యం. ఎప్పటికైనా నిర్మాతగా ఓ సినిమా చేస్తా.  అంతేకాకుండా ఓ సింగిల్ థియేటర్ నిర్మించాలనేదే నా డ్రీమ్
 
- మొదట్లో  అందరిలా సినిమా ఆఫీస్ ల చుట్టూ అవకాశాల కోసం తిరిగాను. ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ సెలెక్ట్ చేశారు. కానీ ఏజ్ సూట్ అవ్వడంలేదని పంపిచారు. అప్పుడు నా స్టైల్ చూసి ఏదో ఒక అవకాశం ఇచ్చారు. ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ ఎక్కువగా వచ్చాయి. రాంసక్కనోడు, ఆది, ఇష్టం, 16 టీన్స్, ఇడియట్, బ్యాడ్ బాయ్స్ సినిమాలు చేశాను.. ఆ తర్వాత విలన్ గ్యాంగ్స్ లో ఎక్కువగా నటించాను. కానీ జబర్ధస్త్ ఎంట్రీ తర్వాతే గుర్తింపు లభించింది. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి , అదిరే అభి, చలాకీ చంటి వాళ్ల వల్ల నాకు జబర్ధస్త్ లోకి ఎంట్రీ దొరికింది.. అదిరే అభి ప్రోత్సాహంతో మరిన్ని అవకాశాలు దక్కాయి. వారికి ఎప్పటికి రుణపడి ఉంటాను. 
 
-  హీరో అవుదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఫస్ట్ టైమ్ సిల్వర్ స్క్రీన్ పై కృష్ణ యాక్షన్ సీన్స్ చూసి బాగా ఫిదా అయ్యాను. ఆ తర్వాత చిరంజీవి సినిమాలు చూశాక మెంటల్ ఎక్కిపోయింది. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ప్రతి ఆదివారం సినిమాలు చూడటం అలవాటై సినిమాలపై మక్కువ పెరిగింది. బ్ర‌హ్మనందం, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, అలీ.. వంటి వారి స్పూర్తి వల్ల కామెడి పాత్రలు  కమెడియన్‌గా కొంత గుర్తింపు తెచ్చుకున్నందుకు సంతోషంగా ఉంది.
 
- టీవీ షోస్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావును అనుకరించడం సాహసమే. కానీ అవినాష్ - కార్తీక్ టీమ్‌లో ఇచ్చిన ఆ వేషం నాకు బాగా పేరుతెచ్చింది. ఒకసారి రాఘవేంద్రరావు గారి ముందే చేశాను. ఆయనేమంటారో అనుకున్నాను. కానీ చాలా అప్యాయంగా దగ్గర తీసుకోని ఆశీర్వదించారు అని తెలిపారు.