సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (11:13 IST)

'అరవింద సమేత' చిత్రంలో ఓ పాట షూటింగ్ రద్దు?

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీయార్ కొత్త చిత్రం ''అరవింద సమేత''. ఈ సినిమాలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీత దర్శకత్వం వహించాడట. దసరా సందర్భంగ

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీయార్ కొత్త చిత్రం ''అరవింద సమేత''. ఈ సినిమాలో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తుంది. అరవింద సమేత చిత్రానికి తమన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈ సినిమాలోని ఓ లిరికిల్ సాంగ్‌ను విడుదల చేయగా, ఇది ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. 
 
సెప్టెంబర్ 20వ తేదీన అరవింద సమేత చిత్రం పాటలన్నింటిని విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో పూర్తిగా కేవలం నాలుగు పాటలు మాత్రమే ఉన్నాయట. ఈ నాలుగు పాటలలో రెండు డ్యూయెంట్ సాంగ్స్, హీరో సోలో సాంగ్ ఒకటి ఉందట. ఇక నాలుగవ పాట బ్యాగ్రౌండ్‌లో మాత్రమే వినిపిస్తుందట. మరో పాటను విదేశాల్లో చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ, ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న కారణంగా ఆ పాట షూటింగ్‌ను రద్దు చేశారని సమాచారం.