1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 21 డిశెంబరు 2018 (20:11 IST)

బసవతారకం, ఎన్టీఆర్ గెటప్ చూస్తే.. కాళ్లపైపడి నమస్కరించాలని వుంది..

హైదరాబాద్‌‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌‌లో ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ తెరకెక్కిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక అట్టహాసంగా ప్రారంభమైంది.


ఈ వేడుకకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి, సూపర్‌స్టార్ కృష్ణ, లోకేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వర్లు, మంచు మోహన్ బాబు, దర్శకధీరుడు రాఘవేంద్రరావు, కృష్ణం రాజు, పరుచూరి బ్రదర్స్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌, టి. సుబ్బరామిరెడ్డి, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌, తారకరత్న‌, కొరటాల శివ, సీనియర్ నరేశ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. 
 
ఈ వేడుక మొత్తానికి నందమూరి బాలయ్య హైలైట్‌గా నిలిచారు. అచ్చుగుద్దినట్లుగా అన్నగారి గెటప్‌‌లోనే బాలయ్య ఆడియో వేడుకకు హాజరయ్యారు. అన్నగారి పంచెకట్టులో వచ్చారు. ఈ కార్యక్రమంలో తొలుత ట్రైలర్ రిలీజ్ అయ్యాక కలెక్షన్ సింగ్ మోహన్ బాబు.. అన్నగారితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆపై దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు మాట్లాడుతూ.. అన్నగారి గెటప్‌లో వున్న బాలయ్యను, బసవతారకం పాత్రలో వున్న విద్యాబాలన్‌ను కొనియాడారు. అన్నగారు, బసవతారకం ఇద్దరూ మా ఇంటికి కలిసి వచ్చేవారని.. ఆ గెటప్‌లో వున్న వీరిద్దరినీ నమస్కరించుకోలేకపోతున్నానని.. అందుచేత కలిసి ఓ ఫోటో తీసుకుంటున్నానని చెప్పారు. 
 
ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ బయోపిక్ లో తన తండ్రి పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ, అచ్చు ఎన్టీఆర్ లానే ఉన్నారని ప్రశంసించారు. చిన్నప్పటి నుంచి తాను ఎన్టీఆర్ అభిమానినని, డిగ్రీ చదువు పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ ని చూడాలని భావించి మద్రాసు వెళ్లి ఆయన్ని కలిశానని చెప్పుకొచ్చారు. సినిమాల్లో నటించే ఆసక్తి ఉందని, మీ సినిమాల్లో ఏదైనా అవకాశమివ్వమని ఎన్టీఆర్‌ని కోరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అలా ఎన్టీఆర్‌తో కలిసి నటించే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కు చెందిన రెండు భాగాలు అద్భుత విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. బాలయ్యకు మంచి గుర్తింపు సంపాదించిపెట్టాలని ఆశించారు.