వరద బాధితుల సహాయార్థంగా 25 లక్షలతో తొలి అడుగు వేసిన ఎన్.టి.ఆర్.
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల సంభవించిన తుఫాను సందర్భంగా పలు గ్రామాలు, ప్రాంతాలు వరదలో మునిగిపోయాయి. ముఖ్యంగా చిత్తూరు, నెల్లూరు, కడప ప్రాంతాలలలోని ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు. కొన్ని ప్రాంతాలలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. ఆఖరికి శ్రీవేంకటేశ్వరుని సన్నిధి అయిన తిరుమల తిరుపతిలోనూ వరద ప్రభావం తీవ్రంగా వుంది. కాలిబాటన సాగే ప్రయాణీకులు రోడ్డు పూర్తిగా కొండచరియలతో మునిగిపోయింది. దర్శనానికి కొద్ది రోజులు వాయిదా వేసుకోమని టి.డి.డి. వారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇదిలా వుండగా, గత కొద్దిరోజులుగా ఆంధ్రలోని వరద పరిస్థితి గురించి తెలుసుకున్న ఎన్.టి.ఆర్. తన ధర్మంగా 25 లక్షల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తున్నట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన పనులు వెంటనే జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఉడతా భక్తిగా తాను సాయం చేశాననీ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.