ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2024 (17:19 IST)

జూనియర్ ఎన్.టి.ఆర్. వార్ 2లో ఎంట్రీ లుక్ అదుర్స్

war 2- ntr
war 2- ntr
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న YRF స్పై యూనివర్స్ చిత్రం కోసం ముంబైకి వచ్చినప్పుడు వార్ 2లో మ్యాన్ ఆఫ్ మాస్ ఎన్టీఆర్ జూనియర్ లుక్ రివీల్ చేశారు. వార్ 2 సూపర్ స్టార్ హృతిక్ రోషన్‌ నటిస్తుండగా,  ఎన్టీఆర్ జూనియర్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు దేవర సినిమా షూటింగ్ లో వుంటూనే మరోవైపు హిందీ సినిమాను చేస్తున్నారు. 
 
war 2- ntr
war 2- ntr
ఈరోజు విడుదలైన గెటప్ కు సోషల్ మీడియా మంచి ఆదరణ లభిస్తోంది. వార్ 2లో ఎన్.టి.ఆర్.  లుక్ అదుర్స్ అంటూ ప్రశంశలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ నాయికగా నటిస్తోంది. వార్ 2 ఆగస్ట్ 14, 2025న విడుదల అవుతుంది.