గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By మోహన్ మొగరాల
Last Modified: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (18:01 IST)

'యాత్ర' దెబ్బకు వణుకుతున్న 'మహానాయకుడు'... రిలీజ్ డేట్ ఓకే... కానీ...

ఎన్టీఆర్ అంటే మామూలు విషయం కాదు. ఐతే ఇందులో ఫస్ట్ పార్ట్ కథానాయకుడు చాలా నిరాశకు గురిచేసింది. ఆ వెంటనే వచ్చిన వైఎస్సార్ బయోపిక్ ప్రశంసలు అందుకుంది. అది కూడా కేవలం పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకుని లాగించేసిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. దీనితో ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్ట్ మహానాయకుడు చిత్రం గురించి అంతా ఆసక్తిగా వున్నారు. 
 
ఇకపోతే నందమూరి బాలకృష్ణ ఎన్టీయార్ బయోపిక్‌ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రెండు భాగాల్లో తెరకెక్కించి, మొదటి భాగం ‘యన్‌టిఆర్‌ కథానాయకుడు’ను సంక్రాంతి బరిలో నిలిపాడు. అయితే ఈ చిత్రం ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. డిస్ట్రిబ్యూటర్‌లకు తీవ్రమైన నష్టాలను తెచ్చిపెట్టింది. వారిని ఆదుకునేందుకు బాలకృష్ణ ముందడుగు వేసారు. వారి కోసం ‘యన్‌టిఆర్‌ మహానాయకుడు’ ని సిద్దం చేస్తున్నాడు. మొదటి భాగం ఫలితంతో జాగ్రత్తపడిన చిత్ర యూనిట్ రెండవ భాగంపై శ్రద్ధపెట్టారు.
 
ఫిబ్రవరి 7వ తేదీనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయింది. కొన్ని సన్నివేశాలను కూడా రీషూట్ చేసినట్లు సమాచారం. తాజాగా చిత్రాన్ని ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. మరి ఈ చిత్రమైనా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని ఆశిద్దాం. 
 
మరోవైపు రామ్‌గోపాల్‌వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీయార్ కూడా షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ని మహానాయకుడితో పాటు విడుదల చేయనున్నట్లు వర్మ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. మొత్తానికి ఎన్టీయార్ జీవితంలోని కీలక ఘట్టాలకు సంబంధించిన అంశాలు ఈ రెండు చిత్రాల్లో ఉండనున్నాయన్నమాట.