శుక్రవారం, 3 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : గురువారం, 3 ఫిబ్రవరి 2022 (16:18 IST)

యాభై రోజుల్లో వ‌స్తున్నాం అంటున్న ఎన్‌.టి.ఆర్‌., రామ్ చ‌ర‌ణ్‌

comming RRR poster
రాజ‌మౌళి త‌న సినిమా ప్ర‌మోష‌న్‌ను విభిన్న‌మై రీతిలో చేస్తుంటారు. సంక్రాంతికి విడుద‌ల కావాల్సిన ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమాను క‌రోనా వ‌ల్ల వాయిదా వేశారు. ఆ త‌ర్వాత మ‌ర‌లా రెండు విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఇక ఈ గురువారం వినూత్నంగా యాభైరోజుల్లో వ‌స్తున్నామంటూ ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు.
 
రామ్ చరణ్ గుఱ్ఱపు స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బుల్లెట్ ను నడుపుతూ షూటింగ్ చేస్తున్న సమయం నాటి ఫొటో అది. 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది అనే విధంగా విడుదల చేయడం విశేషం. ఈ పోస్టర్ వైరల్ గా మారుతోంది. 
 
ఇప్ప‌టికే ఈ సినిమాపై మ‌రింత ఫోస‌క్ ప్రేక్ష‌కులు పెట్టేలా చేస్తున్నాడు. స‌హ‌జంగా సినిమాలు వాయిదా ప‌డ‌డంతో జ‌నాల్లో క్రేజ్ త‌గ్గుతుంది. అటువంటిదేమీలేకుండా రాజ‌మౌళి జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం రౌద్రం రణం రుధిరం. డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.  మార్చ్ 25 వ తేదీన ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.