బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 8 మార్చి 2024 (16:04 IST)

ఓదెల 2 నుంచి శివశక్తిగా తమన్నా భాటియా ఫస్ట్ లుక్

Tamannaah Bhatia as Shiva Shakti
Tamannaah Bhatia as Shiva Shakti
సూపర్‌హిట్ ఓటీటీ చిత్రం ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్ అయిన ఓదెల 2 చిత్రం ఇటీవలే కాశీలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. అశోక్ తేజ దర్శకత్వంలో సంపత్ నంది క్రియేటర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ బ్యానర్‌లపై డి మధు హై బడ్జెట్ తోనిర్మిస్తున్నారు.
 
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని, ఈ చిత్రంలో శివశక్తి పాత్రలో నటిస్తున్న తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాత్ర కోసం తమన్నా కంప్లీట్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు.  నాగ సాధువులా వేషం ధరించి, ఒక దండము, మరో చేతిలో డమరుడు, నుదుటిపై పసుపు బొట్టు, దానిపై కుంకుమ బిందువుతో శివశక్తిగా అద్భుతంగా దర్శనమిస్తున్నారు
 
కాశీ ఘాట్‌లపై నడుస్తూ, ఆమె కళ్ళు మూసుకుని దేవుడిని ప్రార్థిస్తూ కనిపిస్తున్నారు. ఇది అన్ బిలివబుల్ మేక్‌ఓవర్, ఫస్ట్‌లుక్‌ అందరినీ ఆకట్టుకుంది. నిజంగా శివరాత్రికి ఇది పర్ఫెక్ట్ ట్రీట్.
 
ఓదెల 2 గ్రామం చుట్టూ కేంద్రీకృతమై, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుండి ఎలా రక్షిస్తాడనే అంశాలు చాలా అద్భుతంగా వుండబోతున్నాయి.
 
హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహా ముఖ్య తారాగణం. VFX సినిమాలో టాప్ క్లాస్ ఉండబోతుతున్నాయి, ఓదెల 2లో ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు.