శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (14:59 IST)

ఓటీటీలో శర్వానంద్ - అమల నటించిన ఒకే ఒక జీవితం

kanam
హీరో శర్వానంద్, సీనియర్ నటి అమల తల్లీ కుమారులుగా నటించిన చిత్రం ఒకే ఒక జీవితం. సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఆలరించింది. మంచి పాజిటివ్ టాక్‌తో ప్రదర్శితమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని త్వరలోనే ఓటీటీలో విడుదల చేనున్నట్టు ప్రకటించారు.
 
ఇందులో అక్కినేని అమల శర్వానంద్ తల్లి పాత్రలో నటించారు. ఇక మదర్ సెంటిమెంటుతో సాగే ఈ సినిమా ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. నూత‌న ద‌ర్శ‌కుడు శ్రీ కార్తిక్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అక్టోబరు రెండో వారంలో ఈ చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే, విడుదల తేదీని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు. దీని ఓటీటీ హక్కులను సోనీ లైవ్ భారీ ధరకు దక్కించుకుంది.