శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శనివారం, 28 మే 2016 (10:31 IST)

జూన్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’

''ప్ర‌స్థానం'' వంటి డిఫ‌రెంట్ మూవీతో సినిమా రంగానికి ప‌రిచ‌య‌మైన సందీప్‌ కిష‌న్‌ హీరోగా నటించిన చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. కథా బలం ఉన్న సినిమాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే విలక్షణమైన నటి నిత్యా మీనన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. అంజిరెడ్డి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎన్నో చిత్రాలకు రచయితగా పనిచేసిన రాజసింహ తాడినాడ దర్శకత్వంలో మంచి అభిరుచి గల నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా పేరు తెచ్చుకున్న బోగాది అంజిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మిక్కి జె.మేయర్ సంగీతం అందించిన ఈ సినిమా జూన్ 10న విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది. 
 
ఈ వారంలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేస్తాం అని నిర్మాత బోగాది అంజిరెడ్డి అన్నారు. జూన్ 10 న భారీ ఎత్తున రిలీజ్ చేయటానికి ప్లాన్ చేసాము. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తాము. సందీప్‌ కిష‌న్‌ కెరీర్ లో ఈ చిత్రం ఒక మయిలు రాయి వంటిది. ఇటీవలే విడుదల అయిన ఆడియో ఆల్బం ని ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు . మా సినిమా ట్రైలర్ కు యూ ట్యూబ్ లో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయన్నారు.
 
దర్శకుడు రాజసింహ మాట్లాడుతూ.. ''నేను జయంత్ గారి వద్ద, అలాగే పరుచూరి బ్రదర్స్ దగ్గర అసోసియేట్ రైటర్ గా వర్క్ చేశాను. ఇండిపెండెంట్ రైటర్‌గా కూడా 15 సినిమాలకు పనిచేశాను. 2007లో ఈ సినిమా కథను రాసుకున్నాను. రెండు, మూడు సార్లు స్టార్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయిన సినిమా. ఈ కథను ఎలా ఎగ్జిక్యూట్ చేస్తావని చాలా మంది అడిగారు, నాతో పాటు నన్ను, నా కథను నమ్మారు. ఛోటా కె.నాయుడుగారు ఈ ప్రాజెక్ట్ ను టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత సినిమా ట్రాక్ ఎక్కింది. బోగాది అంజిరెడ్డి వంటి నిర్మాతగారు ముందుకు వచ్చారు.
 
ఈ సినిమాలో ఒక గంట పాటు సీజీ వర్క్ ఉంటుంది. కానీ అది తెలియదు. ఈ సినిమా కథలో ఎక్కువ భాగం హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ పై జరుగుతుది. అక్కడా షూటింగ్ కుదరదు కాబట్టి అన్నపూర్ణ స్టూడియోలో సెట్ వేసి మిగతాదంతా గ్రాఫిక్స్ లో క్రియేట్ చేశాం. నిత్యాగారు నాలుగు గంటల పాటు కథ విని ఒప్పుకున్నారు. అద్భుతంగా సపోర్ట్ చేశారు. అలాగే సందీప్ నన్ను నమ్మి సపోర్ట్ చేశారు. నిర్మాత అంజిరెడ్డిగారికి థాంక్స్. ఒక్క అమ్మాయితప్ప అందరినీ నవ్విస్తుంది, ఎంటర్ టైన్ చేస్తుంది, ఎంగేజ్ చేస్తుంది’’ అన్నారు.