శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 10 జూన్ 2024 (14:14 IST)

తెదేపా వాళ్లు పట్టుకుని లోపలేస్తారు, నేను వైసిపికి చెందనిదాన్నని అంటారా?: శ్రీరెడ్డి ఆగ్రహం (video)

SriReddy
సోషల్ మీడియాలో నిత్యం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలను దుమ్మెత్తిపోతే శ్రీరెడ్డి ఒక్కసారిగా వైసిపిపై రివర్స్ అయ్యింది. ఆగ్రహం కట్టలు తెంచుకున్నట్లు మాట్లాడింది. జగన్ పార్టీ పెట్టినప్పట్నుంచి ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడ్డానని చెప్పుకొచ్చింది. అలాంటిది కార్యకర్తలను తెదేపా వాళ్లు దాడి చేస్తుంటే వైసిపి చేతులెత్తేస్తోందని మండిపడింది.
 
తెలుగుదేశం పార్టీ వాళ్లకి వున్న టెక్నాలజీతో నన్ను ఏదో ఒకనాడు పట్టుకుని లోపల ఏసేస్తారు. అప్పుడు నన్ను వైసిపికి చెందిన అమ్మాయిగా మీరు చెప్తారా... చెప్పకుండా చేతులెత్తేస్తారా? నేను ఏడిస్తే వైసిపి పరువు పోతుందని ఈరోజుకి కూడా ధైర్యంగా మాట్లాడుతున్నా... నాయకులు ఎవ్వరూ కూడా బయటకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ నిలదీశారు.