శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (02:43 IST)

ఆ ఒక్క సినిమాతో మా పేర్లే మారిపోయాయి.. రాజమౌళే బాహుబలి: నాజర్ ఉద్వేగం

బాహుబలి వంటి పెద్ద చిత్రాన్ని తీసిన రాజమౌళే ఒక బాహుబలి అని బిజ్జలదేవి పాత్రదారి నాజర్ ప్రశంసించారు. ఇందులో నటించడం గొప్ప వరంగా భావిస్తున్నామని, ‘

బాహుబలి వంటి పెద్ద చిత్రాన్ని తీసిన రాజమౌళే ఒక బాహుబలి అని బిజ్జలదేవి పాత్రదారి నాజర్ ప్రశంసించారు. ఇందులో నటించడం గొప్ప వరంగా భావిస్తున్నామని, ‘సై’ చిత్రం సమయంలోనే రాజమౌళి ‘బాహుబలి’ గురించి చెప్పారని, అయితే ఎలా ఉంటుందో అని తానూ, సత్యరాజ్‌ ఆలోచించామని చివరికి రాజమౌళి మీద నమ్మకంతో ఈ చిత్రంలో నటించామని చెప్పారు. సినిమా విడుదల అయిన తర్వాత తమ పేర్లే మారిపోయేంతగా ఈ చిత్రం ప్రభావితం చేసిందన్నారు. ఈ చిత్రం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులతోపాటు తానూ ఎదురు చూస్తున్నానని నాజర్ ఉద్వేగంతో చెప్పారు. 
 
బాహుబలిలో శివగామి పాత్రతో మెప్పించిన రమ్యకృష్ణ మాట్లాడుతూ.. చారిత్రక చిత్రంలో నటించడం సంతోషాన్ని ఇచ్చిందని, అవకాశం ఇచ్చినందుకు దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పారు. సినిమాలో ప్రతీ పాత్ర ఒక చరిత్రాత్మకమని, ఐదు సంవత్సరాల పాటు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుందని కథానాయిక అనుష్క ఆశాభావం వ్యక్తం చేశారు. మొదటి భాగం కంటే రెండో భాగంలో ఎక్కువ కృషి చేశామని దానికి తగినట్లే సినిమా ఉంటుందన్నారు. మరో కథానాయిక తమన్నా మాట్లాడుతూ.. ‘బాహుబలి’ ఒక ప్రాంతీయ సినిమా కాదని, ప్రపంచ సినిమా అని అన్నారు. భారతీయ సినిమాల్లో మరిచిపోలేని చిత్రమని అభిమానులతోపాటు తానూ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు.