శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 25 మే 2021 (18:56 IST)

సుకుమార్ తండ్రి జ్ఞాపకార్థం రాజోలులో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం

Rajolu oxygen plant
కరోనా మహామ్మరితో ఆక్సిజన్ పడకలు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులను ఆదుకోవడానికి ప్రముఖ సినీ దర్శకుడు సుకుమార్ ఆక్సిజ‌న్ ప్లాంట్‌ను స‌మ‌కూర్చారు. శాశ్వత ప్రాతిపదికన 40 లక్షల వ్యయంతో కాకినాడ సమీపంలోని తన స్వగ్రామమైన రాజోలులోని ప్రభుత్వ సామాజిక కేంద్రంలో ఏర్పాటు చేసిన 80 ఎల్‌పీఎమ్ ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రంను నేడు (మే 25న) ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రారంభించారు.
 
ministar Venugopal
తన తండ్రి కీర్తిశేషులు బండ్రెడి తిరుపతి నాయుడు గారి జ్ఞాపకార్థం సుకుమార్ ఈ సత్‌కార్యాన్ని చేపట్టారు. మంగళవారం రాజోలులో జరిగిన ఈ ప్లాంట్ ప్రారంభోత్సవంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎమ్.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ కీర్తి, నోడల్ ఆఫీసర్ ఐఏఎస్ ప్రవీణ్‌కుమార్,
స్థానిక ఎమ్మెల్యే రాపక వరప్రసాద్, పంచాయతీరాజ్ డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సుకుమార్ స్నేహితుడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దర్శకుడు సుకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని మరికొంత మంది ఇలాంటి సేవాకార్యక్రమాలకు, ముందుకు రావాలని అతిథులు ఆకాంక్షించారు.