ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (18:09 IST)

గోవాలో ఇఫీ.. ఇండియన్ పనోరమా విభాగంలో ''మహానటి''

అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా (ఇఫీ)కి ప్రత్యేక స్థానం వుంది. ఈ ఏడాదికిగానూ నవంబర్‌ 20 నుంచి 28 వరకు గోవాలో ఈ వేడుక జరుగనుంది. ఇందులో ఇండియన్‌ పనోరమా విభాగంలో అలనాటి తార సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన ''మహానటి'' చోటుదక్కించుకుంది.
 
కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో నటించిన ''మహానటి'' అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాయని చెప్పుకుంటున్న తెలుగు సినిమాల్లో ఒకటిగా స్థానం దక్కించుకుంది. ఇక బాలీవుడ్‌ నుంచి పద్మావత్, అక్టోబర్ చిత్రాలు బరిలో ఉన్నాయి. మొత్తంగా 26 సినిమాలు ఇండియన్‌ పనోరమా సెక్షన్‌లో ప్రదర్శనకు అర్హత సాధించాయి. 
 
ఇందులో ఆరు మలయాళ చిత్రాలు, ఐదు బెంగాలీ, హిందీ సినిమాలు, నాలుగు తమిళం, రెండు మరాఠి చిత్రాలు కాగా, తెలుగు, లడఖీ, తులు, జసరి భాషల నుంచి ఒక్కొక్క సినిమా ఈ సెక్షన్‌లో పోటీపడుతున్నాయి. హిందీ నుంచి ఎంపికైన సినిమాల్లో పద్మావత్‌తో పాటు టైగర్‌ జిందా హై, రాజీ, అక్టోబర్‌ చిత్రాలు ప్రధానంగా ఉన్నాయి.