గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 24 జులై 2021 (20:08 IST)

థియేటర్లలో విడుదల అవుతున్న 'పరిగెత్తు పరిగెత్తు'

Parigettu parigettu
సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా 'పరిగెత్తు పరిగెత్తు'. ఈ చిత్రాన్ని ఎన్ ఎస్ సినీ ఫ్లిక్స్ పతాకంపై ఏ యామిని కృష్ణ నిర్మించారు. రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందిన ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాను సెన్సార్ సభ్యులు చూసి అభినందించి యూఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ నెల 30న 'పరిగెత్తు పరిగెత్తు' సినిమా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధమవుతోంది.
 
ఈ సందర్భంగా  దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ, ఇటీవలే సెన్సార్ పూర్తి అయ్యింది. సెన్సార్ రిపోర్ట్ చాలా బాగుంది. యూఏ సర్టిఫికెట్ వచ్చింది. ఈ ఉత్సాహంలో ఈనెల 30 న థియేటర్లలో ''పరిగెత్తు పరిగెత్తు'' మూవీని విడుదల చేయబోతున్నాం. సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది.  ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ లోనూ ఇదే తరహా స్పందన వస్తుందని నమ్ముతున్నాం. 'పరిగెత్తు పరిగెత్తు' సినిమాకు మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.