గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 నవంబరు 2022 (22:31 IST)

వెబ్ సైట్లపై దావా వేసిన నటి పవిత్రా లోకేశ్!

naresh - pavithra
ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ మీడియా ముందుకు వచ్చారు. తన గురించి అభ్యంతరకరమైన కంటెంట్‌ను అప్‌లోడ్ చేయడం ద్వారా తన పేరు, ప్రతిష్టను కించపరిచేలా కొన్ని సోషల్ మీడియా ఖాతాలు యూట్యూబ్ ఛానెల్‌లపై ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ దావా వేశారు.
 
శనివారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు అధికారులతో పవిత్రా లోకేష్ సమావేశమై ఈ మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన చిత్రాలను అభ్యంతరకరమైన రీతిలో పోస్టు చేసిన వెబ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఆమె లింక్‌లను షేర్ చేశారు. 
 
తనను, నటుడు నరేష్ వేధించేందుకు కొన్ని ఛానెల్‌లు ట్రోల్‌లు, అభ్యంతరకరమైన సవరించిన చిత్రాలను ఉపయోగిస్తున్నాయని ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది.