గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 24 మే 2022 (08:45 IST)

అకీరా, ఆద్య, రేణుదేశాయ్‌తో పవన్ కల్యాణ్.. ఫోటో వైరల్

Pawan kalyan
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లో 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ దశలో వుంది. అది పూర్తి కాగానే హరీశ్ శంకర్ 'భవదీయుడు భగత్ సింగ్' షూటింగ్‌లో పాల్గొననున్నారు. అలాగే రేణు దేశాయ్..మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ 'టైగర్ నాగేశ్వరరావు'లో కీలక పాత్ర పోషిస్తోంది. 
 
ఇక్కడ వీరి ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే.. మాజీ భార్యాభర్తలైన రేణూదేశాయ్, పవన్ తన పిల్లలతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యింది. 
 
ట్విట్టర్ వేదికగా తన తనయుడు, తనయ, మాజీ భార్య రేణుదేశాయ్‌తో పవన్ కల్యాణ్ దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పవన్, రేణుదేశాయ్, అకీరా నందన్, ఆద్య చక్కగా నవ్వుతూ కనబడ్డారు. 
 
అకీరా నందన్ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా పవన్ కల్యాణ్ స్కూల్ ఈవెంట్‌కు వెళ్లాడు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది వైరలవుతోంది.