శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: బుధవారం, 2 సెప్టెంబరు 2015 (19:38 IST)

పవన్ కళ్యాణ్ బర్త్ డే... లండన్‌లో జూ.ఎన్టీఆర్ మిఠాయిలు పంచాడు...

సెప్టెంబర్‌ నెలలోనే ప్రముఖ నటులు తెలుగు ఇండస్ట్రీలో పుట్టారు. ఈ రోజు.. అంటే సెప్టెంబర్‌ 2న పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు. ఈరోజే సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. అభిమానులు కొన్నిచోట్ల రక్తదానాలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. అయితే ఇదే రోజు నందమూరి ఫ్యామిలీలో కూడా ఆనందం కల్గించే రోజు. అయితే ఈ రోజును పెద్దగా జరుపుకోకూడదని హరికృష్ణ భావించారు.
 
తన కుమారుడు చనిపోవడంతో పుట్టినరోజు వేడులకు దూరంగా వున్నారు. హరికృష్ణ పుట్టినరోజు కూడా నేడే. ఇదే రోజు ఆయన భార్య షాలిని కూడా పుట్టిన రోజు కావడం విశేషం. షాలిని అంటే.. జూనియర్ ఎన్‌టిఆర్‌ తల్లి అన్నమాట. లండన్‌లో షూటింగ్‌లో వున్న ఎన్‌టిఆర్, చిత్ర యూనిట్‌కు తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా మిఠాయిలు తినిపించాడట.