బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 30 ఆగస్టు 2024 (17:03 IST)

పవన్ కళ్యాణ్ పుష్ప గురించి అనలేదు - పవన్ పుట్టినరోజు నాడు అప్ డేట్ రాబోతుంది

Pawan Kalyan
Pawan Kalyan
ఆమధ్య పవర్ స్టార్ పవన కళ్యాణ్ బెంగళూరు వెళ్ళి అక్కడ ఉపముఖ్య మంత్రి హోదాలు పలువురిని కలిశారు. పర్యావరణం కాపాడాలనే నినాదంతో ఎప్పుడూ వుండే ఆయన ఆరోజు అటవీ సంపదను దోచుకునేవారిని హీరోగా చూపించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ వ్యాఖ్యానించారు. హీరోయిజం అంటే ఇదేనా? అన్న రేంజ్ లో సోషల్ మీడియాలో చర్చ రేగింది. దీనిపై పవన్ కళ్యాణ్ తో సినిమా తీస్తున్న నిర్మాత రవిశంకర్ ను అడిగితే. ఆయన ఈ విధంగా సమాధాన చెప్పారు. 
 
పవన్ కళ్యాణ్ గారు అప్పుడు అన్న సందర్భం వేరు. అక్కడ జరిగిన చర్చలో పలు అంశాలు వచ్చాయి. పలు సినిమాలు ఆ నేపథ్యంలో కూడా వచ్చాయి. కానీ కొందరు పనిగట్టుకుని పుష్ప సినిమాకు ఆపాదించేలా వార్తలు రాసేశారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు అలా అని వుండదు. ఎప్పటికైనా మెగా కుటుంబమంతా ఒక్కటే అంటూ తెలిపారు. 
 
కాగా, ఇటీవలే పవన్ ను రవిశంకర్ కలిశారు. దీనిపై స్పందిస్తూ,  పవన్‌ని కలిసాము.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ అప్పటికల్లా పూర్తిచేసేస్తాం అని నిర్మాత తెలిపారు. ఉస్తాద్ భగత్ షూట్ కొన్ని వారాల్లో మొదలుపెడతాము. మొత్తం షూట్ డిసెంబర్ లేదా జనవరి కల్లా పూర్తి చేసేస్తాము. సెప్టెంబర్ 2న పవన్ పుట్టిన రోజు నాడు ఆల్రెడీ షూట్ చేసిన దాని నుంచి ఏదో ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తాము అని అన్నారు.