Widgets Magazine

'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతులు' పూనమ్ ఎవరిని అలా అంది?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు‌- కత్తి మహేష్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి.. కత్తి నోటిలో నానింది. ఇటీవల పవన్‌‍కు మద్దతిచ్చినట్లు కామెంట్లు చేసిన పూనమ్ కౌర

selvi| Last Updated: సోమవారం, 29 జనవరి 2018 (09:54 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు‌- కత్తి మహేష్ మధ్య వార్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ వివాదంలో పూనమ్ కౌర్ ఎంట్రీ ఇచ్చి.. కత్తి నోటిలో నానింది. ఇటీవల పవన్‌‍కు మద్దతిచ్చినట్లు కామెంట్లు చేసిన పూనమ్ కౌర్.. తాజాగా అదే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కోపానికి కారకురాలైంది. 'డబ్బుల కోసం మారిపోయిన సిద్ధాంతులు' అంటూ ఎవరి పేరు చెప్పకుండా పూనమ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పట్ల పవన్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

పూనమ్ కౌర్ ఎవరి పేరునూ ప్రస్తావించక పోయినప్పటికీ, ఆమె చేసిన వ్యాఖ్యలు తమ హీరోను ఉద్దేశించినవేనని పవన్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తనకు అండగా ఉన్న వ్యక్తిపైనే అభాండాలు వేస్తోందని, ఆమెకు ఇబ్బందులు తప్పవని పూనమ్‌ను హెచ్చరిస్తున్నారు. పూనమ్ డ్రామాలు చేస్తుందని.. తర్వాత సినిమాల గురించి ట్వీట్లు చేసుకుంటే మంచిదని వార్నింగ్ ఇస్తున్నారు.


దీనిపై మరింత చదవండి :