శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి వెంకటరమణ
Last Modified: శుక్రవారం, 27 డిశెంబరు 2019 (19:42 IST)

శ్రీరెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చిన పవన్ ఫ్యాన్.. ఆమె చూస్తే ఏం చేస్తుందో?

ఇప్పటికే సోషల్ మీడియాలో పలుమార్లు పవన్ కళ్యాణ్‌ను తిట్టి ఆయన ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైంది శ్రీరెడ్డి. కొద్దికాలం సైలంట్‌గా ఉన్న ఆమె తాజాగా మళ్లీ నోటికొచ్చినట్లు బూతులు తిడుతూ ఓ వీడియోను పోస్ట్ చేసిన విషయం. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ మళ్లీ మండిపోయారు. తాజాగా ఆయన అభిమానిగా చెప్తూ ఓ యువకుడు శ్రీరెడ్డికి ఆమె భాషలోనే బహిరంగంగా వార్నింగ్ ఇస్తున్నాడు.
 
శ్రీరెడ్డి అసలు మనిషి జాతికి పుట్టలేదు. అసలు ఆమె భారతదేశ మహిళేనా? ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీద పడి ఏడుస్తుంటావ్? నీకిక వేరే పని లేదా? నీ వల్ల స్త్రీజాతికే మచ్చ. మా పవన్ అన్న ఫ్యాన్స్ తలుచుకుంటే నువ్వు ఎక్కడ దాక్కున్నా బయటకు వచ్చి చంపేయగలరు. నాకు నిన్ను చంపేయాలని ఉందంటూ వార్నింగ్ ఇస్తున్న వీడియో నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియో శ్రీరెడ్డి కంటపడితే ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.