గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 ఫిబ్రవరి 2024 (11:08 IST)

పన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీర మల్లు అప్ డేట్ వచ్చేసింది

hariharaveeramallu
hariharaveeramallu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం హరి హర వీర మల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్ దర్శకుడు. రెండు రోజులనాడే క్రిష్ తన పుట్టినరోజు నాడు అప్ డేట్ త్వరలో రాబోతుందని ప్రకటించాడు. ఇక కొద్దిసేపటి క్రితమే మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ పవర్ ఫ్యాన్స్, సినిమా లవర్స్ అందరికీ ఇక్కడ ఒక అప్‌డేట్ ఉంది అంటూ వెల్లడించింది
 
Update letter
Update letter
ప్రస్తుతం హై-ఎండ్ VFX పనులు పురోగతిలో ఉన్నాయి. ఇరాన్, కెనడా, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాలలో సాంకేతిక పనులు త్వరితగతిన జరుగుతున్నాయని తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఈ సినిమా నుండి అతి త్వరలో ఒక ప్రత్యేక ప్రోమో మీ ముందుకు రాబోతోంది, అది మిమ్మల్ని మీ సీటు అంచున కూర్చోబెడుతుంది అంటూ పేర్కొంది.
 
ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలలో ఇది చాలా కీలకమైంది. చరిత్రలోని ఓ అంశాన్ని దర్శకుడు క్రిష్ ఎంచుకున్నాడు. ఈ సినిమాకు కీరవాణి బాణీలు సమకూరుస్తున్నారు. ఎ.ఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైపర్ ఆది, ఐషురెడ్డి తదితరులు నటిస్తున్నారు.