Widgets Magazine

పవన్ మానియా.. ఒక్క షో పడకుండానే రికార్డులు... ఎక్కడ?

బుధవారం, 10 జనవరి 2018 (13:25 IST)

AgnyaathavaasiStorm1

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈయ‌న పేరు ఓ సంచ‌ల‌నం. చేసిందే 25 సినిమాలే అయిన ప్ర‌జ‌ల గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాడు. భాష‌, భేదం, ప్రాంతం అనే తేడా లేకుండా ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సుల‌ని గెలుచుకున్నాడు. కేవ‌లం న‌టుడిగానే కాకుండా, సామాజిక స్పృహ ఉన్న వ్య‌క్తిగా, జ‌న‌సేనానిగా అందరికి ద‌గ్గ‌ర‌య్యాడు. ప‌వ‌న్ క్రేజ్ కేవ‌లం మ‌న తెలుగు రాష్రాల‌లోనే కాదు దేశ విదేశాల‌కి పాకింది.
 
ఈనేపథ్యంలో బుధవారం పవన్ నటించిన "అజ్ఞాతవాసి" చిత్రం విడుదలైంది. ఈ చిత్రం అమెరికాలో థియేటర్లకు రాకుండానే రికార్డులు సృష్టిస్తోంది. తొలి ఆట కూడా పడకుండానే అడ్వాన్స్ బుకింగుల్లో రికార్డు నమోదైంది. థియేటర్ల ఎదుట పవన్ అభిమానులు బారులు తీరారు. 'అజ్ఞాతవాసి' మేనియాతో ఊగిపోతున్నారు. సంక్రాంతి కానుకగా పవన్ కల్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమాకు అభిమానులు నీరాజనాలు పడుతున్నారు.
AgnyaathavaasiStorm2
 
ఇదిలావుంటే, అజ్ఞాత‌వాసి చిత్రం విడుదలను పవన్ ఫ్యాన్స్ ఓ పండుగలా జరుపుకుంటున్నారు. కొంద‌రు ప‌వ‌న్‌ని దేవుడిగా కొలుస్తుంటే మ‌రి కొంద‌రు ఇంట్లో త‌మ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నారు. ప్లేస్ ఏదైన‌, ఫంక్ష‌న్ ఎక్క‌డైన ప‌వ‌న్ జపం చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ చ‌ర్య‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. 
 
చిట్టిపొట్టి చిన్నారులకు ‘అజ్ఞాతవాసి’ గెటప్ వేయించి.. పవన్ మేనియా అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఫ్యాన్స్‌. సైకిలెక్కిన 'అజ్ఞాతవాసి' నోట్లో బెల్టు పెట్టుకుని ఉన్న స్టిల్‌ను ఫాలో అవుతూ చిన్నారిని అలా రెఢీ చేయ‌డం ప‌వ‌న్‌పై వారికున్న అభిమానం ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఇంకొంద‌రు ప‌వ‌న్‌ని దేవుడిగా కొలుస్తూ ర‌థోత్సవం చేస్తున్నారు.
AgnyaathavaasiStorm3
 
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ నేత కార్మికుడు పవన్‌పై అంతులేని అభిమానాన్ని చాటుకున్నారు. పట్టుచీరపై ఏకంగా పవన్ కళ్యాణ్ ఫోటోనే నేసారు. ఇలా ఒకరుకాదు ఇద్దరుకాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు తమకునచ్చిన రీతిలో పవన్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అజ్ఞాతవాసి' పబ్లిక్ టాక్ సరేగానీ.. ఎన్ని రికార్డులు నెలకొల్పుతాడో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు.. సినీ ఇండస్ట్రీ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ...

news

చలపతిరావు కామెంట్స్‌-సూపరన్న రవి.. నాంపల్లి కోర్టుకు హాజరు

'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి నటుడు చలపతిరావు అభ్యంతరకర ...

news

'కోటేశ్వర రావు'లు హర్ట్ అవుతున్నారు... పవన్ సారీ చెప్పేస్తాడేమోలే...

ఇల్లు కాలి ఒకడేడుస్తోంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పడిగాడట వెనకటికొకడు.. అలా ఉంది.. ...

news

కత్తి మహేష్ రిపోర్ట్... ''అజ్ఞాతవాసి'' చెత్త సినిమా.. చికాకు పెట్టారు...

అజ్ఞాతవాసి ''చెత్త సినిమా'' అనేశాడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్. పవర్ స్టార్ పవన్ ...

Widgets Magazine