కరోనా నుంచి కోలుకున్న పవన్ కళ్యాణ్
గత కొద్దిరోజులుగా కరోనా పాజిటివ్ బారిన పడిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంగా వున్నాననీ, కరోనా నుంచి కోలుకున్నానని శనివారంనాడు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ కు ముందే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “వకీల్ సాబ్” అనూహ్య విజయాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కొద్ది లోనే పవన్ కు కరోనా పాజిటివ్ వచ్చింది అన్న వార్త ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా పవన్ అభిమానుల్లో అయితే చాలా నిరుత్సాహతను తీసుకొచ్చింది.
ఆ తర్వాత కొద్దిరోజులకే తనకు నెగెటివ్ వచ్చిందని ప్రకటించారు. అయినా కొంచెం నీరంగా వుండడంతో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. జనసేన సోషల్ మీడియా నుంచి కూడ పవన్ ఆరోగ్యం పరంగా ఎలాంటి అప్డేట్స్ పెద్దగా ఇవ్వకపోవడం వంటివి ఇంకా విస్తు తెప్పించాయి.
కానీ ఇప్పుడు ఎట్టకేలకు పవన్ ఆరోగ్యం పట్ల అధికారిక క్లారిటీ వచ్చేసింది. పవన్ ఆరోగ్యం పూర్తిగా కుదురుకుంది అని జనసేన ప్రెస్ నోట్ వచ్చింది. కరోనా తర్వాత బాధపడుతున్న పవన్ ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారని ఆయనను పర్యవేక్షిస్తున్న డాక్టర్లు ధృవీకరించారు. తన ఆరోగ్యం కోసం పూజలు, ప్రార్థనలు చేసిన జనసైనికులు, అభిమానులు, నాయకులకు ఆయన మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు.
అలాగే కరోనా విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ జాగరూకతతో వుండాలనీ, వైద్య నిపుణులు అందిస్తున్న సూచనలను అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.