బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 3 నవంబరు 2021 (12:39 IST)

రచ్చ రచ్చ చేస్తున్న 'భీమ్లా నాయక్'

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "భీమ్లా నాయక్". ఈ చిత్రంలో రానా ప్రతి నాయకుడుగా నటిస్తున్నారు. సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియం" తెలుగు రీమేక్‌గా రూపొందుతోంది. 
 
చిత్రానికి 'భీమ్లా నాయ‌క్' అనే టైటిల్ ఫిక్స్ చేయ‌గా, చిత్రంలో ప‌వ‌న్ పాత్ర పేరు కూడా ఇదే అని తెలుస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు. 
 
బుధవారం “భీమ్లా నాయక్” అప్‌డేట్ ఇచ్చారు. ఈరోజు సాయంత్రం 07:02 గంటలకు “లాలా భీమ్లా” వీడియో సాంగ్ ప్రోమో విడుదలవుతుందని ప్రకటిస్తూ, “ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అని ప్ర‌క‌టించారు. 
 
అయితే తాజాగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు. ఇది కొంత ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఈ చిత్రం 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.