లోక కల్యాణం కోసం పవన్ కల్యాణ్ చాతుర్మాస్య వ్రతం
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రతి యేటా చాతుర్మాస్య దీక్ష చేస్తుంటారు. ఈ దఫా కూడా ఆయన దీక్షలోకి వెళ్లినట్లు చెపుతున్నారు. లోక కల్యాణం కోసం, ప్రజలు సుఖసంతోషాలతో వుండాలని కోరుకుంటూ పవన్ కల్యాణ్ ఈ దీక్షను పాటిస్తుంటారని అంటున్నారు. ఇంతకీ చాతుర్మాస్య వ్రతం అంటే ఏమిటి... దానిని ఎందుకు చేస్తారు చూద్దాం.
తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి నుంచి విష్ణుమూర్తి నాలుగు నెలల యోగనిద్రలోకి వెళ్లిపోతారు. కనుక ఈ 4 నెలలు ఆచరించాల్సిన వ్రతాన్ని చూతుర్మాస్య వ్రతం అంటారు. విష్ణుమూర్తి అనుగ్రహాన్ని కోరుతూ వ్రతం చేస్తారు. దీనికి స్త్రీ, పురుష భేదం లేదు. వితంతువులు, యోగినులెవరైనా చేయవచ్చు.
ఒకపూట భోజనం, బ్రహ్మచర్యం, నేలపై పడుకోవడం వంటి కఠిన నియమాలున్నాయి. ఈ సమయంలో కఠిన పదాలతో దూషించడం వంటివి కూడదు. ఇంకా ఈ దీక్షను చేసేవారు ఊరి పొలిమేర దాటరాదనే నియమం వుంది.