శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (22:06 IST)

'భీమ్లా నాయక్' పూర్తి - 'హరిహర వీరమల్లు'కు బ్రేక్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాల్లో నటిస్తూ దూకుడు మీద ఉన్నారు. ఇప్పటికే "భీమ్లా నాయక్" చిత్రాన్ని పూర్తి చేసిన ఆయన.. "హరిహర వీరమల్లు" చిత్రం షూటింగ్‌ని 50 శాతం మేరకు పూర్తి చేశారు. దీంతో తదుపరి షెడ్యూల్ కోసం దర్శకుడు క్రిష్ ప్లాన్ చేశారు. అయితే, దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రభావం అధికంగా ఉండటంతో ఇప్పట్లో వద్దని పవన్ వారించారు. దీంతో "హరిహర వీరమల్లు" చిత్రం షూటింగ్‌కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. 
 
కాగా, క్రిస్మస్ సెలవుల కోసం ఆయన తన భార్యను తీసుకుని రష్యా వెళ్లారు. ఇటీవలే అక్కడ నుంచి తిరిగి వచ్చారు. సంక్రాంతి తర్వాత అంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఆయన "వీరమల్లు" చిత్రం షూటింగ్‌ను ప్లాన్ చేశారు. కానీ, దేశంలో కరోనా ఉధృతి తీవ్రంగా ఉంది. దీంతో పవన్ వెనుకంజ వేశారు. గతంలో పవన్ ఒకసారి కరోనా వైరస్ బారినపడిన విషయం తెల్సిందే. కాగా, పవన్ చేతిలో ఈ రెండు చిత్రాలు కాకుండా మరో రెండు చిత్రాలు ఉన్నాయి.