శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: శుక్రవారం, 31 జులై 2015 (19:35 IST)

'సర్దార్‌' ఎంటరయ్యాడు... పవన్ కళ్యాణ్ లుక్ అదుర్స్...

గబ్బర్‌ సింగ్‌ తర్వాత దాని సీక్వెల్‌గా గబ్బర్‌ సింగ్‌-2 అంటూ పవన్‌ కళ్యాణ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి 'సర్దార్‌' అనే పేరు మార్చినట్లు తెలిసింది. ఈ చిత్రం చిత్రీకరణ మూడు రోజులుగా హైదరాబాద్‌ శివార్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. పవన్‌ కళ్యాణ్‌ ఎర్రటి గుర్రంపై ఎక్కి రౌడీలని కంట్రోల్‌ చేసే సన్నివేశాలను చిత్రిస్తున్నారు.
 
రామ్‌ లక్ష్మణ్‌ ఫైట్‌మాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. కౌబాయ్‌ తరహాలో గెటప్‌లో ఆ సన్నివేశాలను చిత్ర దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్‌ స్నేహితుడు శరద్‌ మరార్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర స్టిల్‌ను నిర్మాత ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ కోసం పోస్ట్‌ చేశాడు.