మొగలయ్యకు పవన్ కళ్యాణ్ రెండు లక్షలు సాయం
భీమ్లా నాయక్‌ను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాల్ని పలికించిన దర్శనం మొగులయ్యకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండు లక్షల ఆర్థిక సాయం అందచేస్తున్నట్లు ప్రకటించారు. శనివారంనాడు జనసేన పార్టీ నుంచి లిఖితపూర్వకంగా మీడియాకు తెలియజేశారు. తెలంగాణలోని ఆమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసిన అరుదైన కళాకారుడు.
వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న కళలను, కళారూపాలను వెలుగులోకి తెచ్చేందుకు యువతకు తెలియజెప్పేందుకు పవన్ కళ్యాణ్ కంకణం కట్టుకున్నారు. మొగలయ్య కిన్నెర మీటుతూ పాటలు ఆలపిస్తుంటారు. పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారు. అందుకే పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్స్‌లెన్సీ- ద్వారా 2లక్షల రూపాయలు అందించాలని నిర్ణయించారు. త్వరలో చెక్‌ను ఆయనకు అందజేయనున్నారని జనసేన పార్టీ కార్యాలయం తెలియజేసింది.
కాగా, భీ మ్లానాయక్ పై పాడిన పాట ఇప్పటికే ఆదరణ పొందింది. అయితే తమన్ బృందం పాడిన పాటలో సాహిత్యం తప్పుగా వుందని పలువురు విమర్శించారు.
భీమ్లానాయక్ సాంగ్ హమ్మింగ్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మరి లేటెస్ట్ గానే 12 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న ఈ సాంగ్ ఇంకా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.