ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్‌కి పోటీగా పవన్ మూవీ
యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ల క్రేజీ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి ప్రెస్టేజీయస్‌గా రూపొందిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. జులై 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని 2021 జనవరి 8న రిలీజ్ చేయనున్నట్టు ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తుంది అని ఎనౌన్స్ చేసినప్పటి నుంచి సంక్రాంతికి రావాలనుకున్న సినిమాలన్నీ సమ్మర్‌కి పోస్ట్‌పోన్ అయ్యాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సమ్మర్లో సినిమాని స్టార్ట్ చేయాలనుకున్నారు. వంశీ పైడిపల్లితో సినిమా క్యాన్సిల్ అయినప్పటికీ... ఎవరితో సినిమా చేసినా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు. అయితే... సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో మహేష్ మూవీని 2021 సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎందుకంటే.. ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిలతో మహేష్ బాబుకి మంచి అనుబంధం ఉంది. అందుచేత ఆర్ఆర్ఆర్ సినిమాకి పోటీగా మహేష్ బాబు తన సినిమాని రిలీజ్ చేయాలి అనుకోవడం లేదు. అందుకనే సంక్రాంతికి మూవీ రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ... సమ్మర్‌కి వాయిదా వేసుకున్నారు.
అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మే నెలాఖరు నుంచి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేయనున్నారు. ఈ భారీ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సమ్మర్లో ఈ మూవీని ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే... ఆర్ఆర్ఆర్ జులై లేదా దసరాకి వస్తే ఈ సినిమాని సంక్రాంతికే రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ... ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి వస్తుండడంతో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీని సమ్మర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇవే కాకుండా మరికొన్ని సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అనుకున్నప్పటికీ ఆర్ఆర్ఆర్ వస్తుండటంతో తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు.
అయితే... పవన్ - క్రిష్ మూవీని దసరాకి రిలీజ్ చేయాలి అనుకుంటున్నాం. ఒకవేళ దసరాకి రావడం మిస్ అయితే.. మాత్రం సంక్రాంతికే రిలీజ్ చేస్తామని ఆ చిత్ర నిర్మాత ఎ.ఎం.రత్నం చెబుతున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఈ భారీ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ మూవీని తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. పాన్ ఇండియా మూవీలా ఈ సినిమాని రూపొందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పచ్చు.
సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ వస్తుంది. ఒకవేళ పవన్ - క్రిష్ మూవీ కూడా సంక్రాంతికి వస్తే... బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాలు పోటీపడితే.. సినీ అభిమానులకు పండగే. మరి.. పవన్ క్రిష్ మూవీ దసరాకి వస్తుందా..? సంక్రాంతికి వస్తుందా..? అనేది క్లారిటీ రావాలంటే... కొన్ని రోజులు ఆగాల్సిందే.