గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 22 మే 2024 (13:51 IST)

థియేటర్స్ లో సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న పాయ‌ల్ రాజ్‌పుత్ రక్షణ

Payal Rajput Rakshana
Payal Rajput Rakshana
‘‘వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. . ఇప్ప‌టి వ‌ర‌కు నేను క‌చ్చితంగా వాడిని క‌ల‌వ‌లేదు.. ఏరోజు నేను వాడ్ని క‌లుస్తానో అదే అఖ‌రి రోజు’’    అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేస్తోంది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ఇంత‌కీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవ‌రికీ? ఎందుకోసం.. ఎవ‌రినీ ఆమె వెతుకుతుంది? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు మేక‌ర్స్‌.
 
‘Rx100’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనదైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన పాత్ర‌ల‌కు భిన్నంగా..ప‌వ‌ర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో  న‌టించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్ ‘రక్షణ’. రోష‌న్‌, మాన‌స్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. మంగళవారం ఈ సినిమా టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే..ఓ హంతకుడు క్రూరంగా హ‌త్య‌లు చేస్తుంటాడు.. అత‌నెవ‌రో క‌నిపెట్టి అరెస్ట్ చేయాల‌ని పోలీస్ ఆఫీస‌ర్ అయిన పాయ‌ల్ రాజ్‌పుత్ ప్ర‌య‌త్నిస్తుంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా ర‌క్ష‌ణ చిత్రం మెప్పించ‌నుంది.
 
హ‌రిప్రియ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ‌ర‌వేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్‌.  
 
ద‌ర్శ‌క నిర్మాత ప్ర‌ణ‌దీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘ ‘రక్షణ’ టీజ‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇదొక ఓ క్రైమ్‌ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయిల్ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు.  ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన  ఘటన స్పూర్తితో రాసిన కథతో సినిమా రూపొందింది. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.