గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 3 జులై 2024 (18:10 IST)

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

Peka Medalu  Second single
Peka Medalu Second single
'నా పేరు శివ', 'అంధగారం' తదితర హిట్ చిత్రాల్లో నటించిన వినోద్ కిషన్ (Vinod Kishan)ను 'పేక మేడలు'తో హీరోగా పరిచయం చేస్తూ అనూష కృష్ణ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా పేక మేడలు. ఎవరికి చెప్పొద్దు సినిమాతో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి విజయాన్ని అందుకొని ఇప్పుడు పేక మేడలు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు.

గతంలో ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫస్ట్ సాంగ్ కు అనూహ్య స్పందన లభించింది. రీసెంట్ గా హీరో వినోద్ కిషన్ చేసిన వినూత్న ప్రమోషనల్ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాలోని రెండవ సింగిల్ ఆడపిల్ల సాంగ్ విడుదలైంది.
 
'ఆనందం అత్తకు స్వాహా మనశాంతి మామకు స్వాహా ఆడదాని జన్మంతా స్వాహా' అంటూ సాగే ఈ సాంగ్ సింగర్ సాకే రాజశేఖర్ గారు పాడగా లిరిక్స్ రాసింది భార్గవ కార్తీక్. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ చాలా ఎట్రాక్టివ్ గా కొత్తగా ఉంది. ఈ పాట అధ్యంతం  కొత్తగా, వైవిద్యంగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. ఒక మంచి కాన్సెప్ట్, కంటెంట్ ఉన్న స్టోరీగా ఈ సినిమా ఖచ్చితంగా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమా జూలై 19న విడుదల చేస్తున్నట్టు తెలిపారు మూవీ టీం.