శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జనవరి 2016 (12:07 IST)

పులితో పీటర్ హెయిన్ ఫోజులు.. బాహుబలి 2 కోసం సాహసాలు చేస్తున్నాడా?

ఫేమస్ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ ఫైట్స్ పరంగా సాహసాలు చేస్తుంటారు. హీరోలకు డూప్ చేసే ఫైటర్లు రియాల్టీ కోసం ఎన్నెన్నో చేస్తారు. సాధారణంగా ఫైట్ల సీన్లలో నదులుంటాయి రైళ్లుంటాయి పులులుంటాయి మొసళ్లు కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ సినిమాల మట్టుకే. కానీ నిజజీవితంలో చేస్తే...అలా ఎవరు చేస్తారేంటి అనుకోకండి. తాను చేపిస్తున్న సీన్‌లు నిజంగా చేస్తే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అనుకున్నారో ఏమో పీటర్ హెయిన్స్ ఇదే పనిలో బిజీగా ఉన్నారు.
 
సినిమా స్టిల్స్‌ను అధ్యయనం చేస్తున్నాడో లేకపోతే సరదాకు ఫోజులే ఇస్తున్నాడో తెలియదు కానీ...మాంచి బలిష్టంగా ఉండి చూస్తేనే గగుర్పాటు కలిగించేలా ఉన్న పెద్దపులితో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. ఇవి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచాయి. పులిని మచ్చిక చేసుకొని దాని మీద ఎక్కి కూర్చొని బోర్ల పడుకోబెట్టి నడుం నిమురుతూ.....ఇలా వేర్వేరు యాంగిల్స్‌లో పీటర్ ఫోజులిచ్చారు. ఈ స్టిల్స్ బాహుబలి కోసమేనని.. బాహుబలి సినిమా కోసం పులిని ఫైటర్ మచ్చిక చేసుకుంటున్నాడని నెటిజన్లు అంటున్నారు.