శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By dv
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (15:23 IST)

విందు భోజనంలాంటి సినిమా 'పిచ్చిగా నచ్చావ్‌' ఫస్ట్‌ లుక్‌ ఆవిష్కరణ .. ఫస్ట్ లుక్ రిలీజ్

'ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైనశైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత తమలో కోపం, ఈర్ష్య, ద్వేషం

'ప్రేమన్నది యూనివర్సెల్‌. కానీ ప్రేమలో ఉన్న ప్రతి మనిషి తనదైనశైలిలో నిర్వచనం చెబుతుంటారు. అంటే ప్రేమ అన్నది వ్యక్తిగతం కూడా. చిన్న విషయాన్ని కూడా అర్థం చేసుకోకుండా నేటి యువత తమలో కోపం, ఈర్ష్య, ద్వేషం పెంచుకుపోతున్నారు. దీనివల్ల మనుషులు, మనసులు విడిపోతున్నాయి. అలాంటి అయోమయంలో ఇరుక్కున్న ఓ యువకుడు ప్రేమకు సరైన నిర్వచనం తెలుసుకుని తన వల్ల జరిగిన పొరపాటుని ఎలా సరిదిద్దుకున్నాడు? తన జీవితాన్ని అందంగా ఎలా మలుచుకున్నాడు అన్నది తెరపైనే చూడాలంటున్నారు'' నిర్మాత కమల్‌ కుమార్‌ పెండెం. 
 
సంజయ్‌, చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఇటీవల నాని ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ''కథ ఏంటనేది రివీల్‌ కాకుండా ఫస్ట్‌లుక్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్‌ చేశారు. సినిమా విజయవంతమై టీమ్‌కు మంచి పేరు, లాభాలు రావాలి'' అని అన్నారు. 
 
నిర్మాత కమల్‌కుమార్‌ పెండెం మాట్లాడుతూ ''చక్కని ప్రేమకథలో రూపొందుతున్న చిత్రమిది. వల్గారిటీ లేకుండా కుటుంబం మొత్తం చూసేలా ఉంటుంది. 46 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశాం. నిర్మాతగా తొలి సినిమాకి చక్కని టీమ్‌ కుదిరింది. దర్శకుడు చెప్పింది చెప్పినట్లుగా తెరకెక్కించారు. లావిష్‌గా సినిమాను రూపొందించాం. త్వరలో ప్రచార చిత్రాలను, పాటల్ని విడుదల చేసి, సినిమా ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తాం'' అని అన్నారు. 
 
దర్శకుడు మాట్లాడుతూ.. ''నా ఐడియాను నమ్మి నిర్మాత అవకాశం ఇచ్చారు. మొదటి సినిమాకు చక్కని నిర్మాత దొరకడం నా అదృష్టం. సినిమా బాగా వచ్చింది. టీమ్‌ అంతా నమ్మకంగా ఉన్నాం'' అని తెలిపారు. ''మేం అడగ్గానే పాజిటివ్‌గా స్పందించి ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన నానిగారికి థ్యాంక్స్‌. విందు భోజనంలాంటి సినిమా ఇది. త్వరలో పాటల్ని విడుదల చేస్తాం'' అని ప్రొడక్షన్‌ డిజైనర్‌ పుచ్చా రామకృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమంలో నందు, జశ్వంత్‌, చేతన తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకటహనుమ, సంగీతం: రాం నారాయణ, ఆర్ట్‌: రమేష్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: పుచ్చా రామకృష్ణ, సమర్పణ: శ్రీమతి శైలజ.