నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు.. గట్టిగా అరిచాడని న్యూసెన్స్ కేసు
మెగా బ్రదర్, నటుడు నాగబాబు అల్లుడు చైతన్యపై కేసు నమోదైంది. అపార్ట్‌మెంట్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడంటూ చుట్టుపక్కలవాళ్లు అభ్యంతరం చెప్పగా అర్ధరాత్రి గొడవ జరిగింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అపార్ట్ మెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. అయితే.. నిహారిక భర్త చైతన్య కూడా అపార్ట్ మెంట్ వాసులపై కంప్లయింట్ ఇచ్చాడు. పోలీసులు పరస్పర ఫిర్యాదులను స్వీకరించి విచారణ చేస్తున్నారు.
గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు.. మెగా ప్రిన్సెస్ నిహారికతో గతేడాది డిసెంబర్‌లో ఘనంగా వివాహం జరిగింది. ఇక పెళ్లయ్యాక నిహారిక భర్తతో కలిసి మాల్దీవుల్లో హనిమూన్ చేసుకున్న ఈ జంట.. సెకండ్ వేవ్ తర్వాత పాండిచ్చేరిలో రెండో హనీమూన్ ట్రిప్ వేశారు.
నిత్యం సోషల్ మీడియాలో హంగామా చేసే ఈ జంట.. హైదరాబాదులోని బంజారాహిల్స్‌లోని ఓ అపార్టుమెంటులో వుంటున్నారు. అయితే చైతూపై ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులో న్యూసెన్స్ కేసు నమోదు కావడం కలకలం రేపింది.