Widgets Magazine

షూటింగ్ లొకేషన్లకు షటిల్ సర్వీస్... జోష్ పెంచిన పూజా

పూజా హెగ్డే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ముకుంద' వంటి క్లాసికల్ టైటిల్‌తో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడు టాప్ హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అల్లు అర్జున్ "డీజే"

pnr| Last Updated: గురువారం, 13 సెప్టెంబరు 2018 (14:26 IST)
పూజా హెగ్డే. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ముకుంద' వంటి క్లాసికల్ టైటిల్‌తో టాలీవుడ్ వెండితెరకు పరిచయమైంది. ఇప్పుడు టాప్ హీరోలతో వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. అల్లు అర్జున్ "డీజే" సినిమా తర్వాత ఈ అమ్మడి రేంజ్ బాగా పెరిగిపోయింది. సినిమా సినిమాకు సక్సెస్‌ను పెంచుకుంటున్న ఈ అమ్మడు ప్రస్తుతం టాలీవుడ్లో మూడు, బాలీవుడ్‌లో ఓ సినిమా చేస్తోంది.
 
అలాగే, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'అరవింద సమేత వీర రాఘవ', మహేష్ బాబు 'మహర్షి', ప్రభాస్ కొత్త సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తున్నది. అదేవిధంగా బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ చేస్తున్న "హౌస్‌ఫుల్ 4" కామెడీ ఎంటర్‌టైనర్‌లో హీరోయిన్‌గా ఎంపికైంది.
 
ఈ చిత్రం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ఈ నాలుగు సినిమాలు వరుసగా షూటింగ్ జరుపుకుంటుండటంతో షూటింగ్ స్పాట్స్‌కు చుట్టూ షటిల్ సర్వీస్ చేస్తున్నది. ఈ నాలుగు సినిమాల్లో మొదటి ఎన్టీఆర్ అరవింద సమేత అక్టోబర్ 11వ తేదీన విడుదల కానుంది. తర్వాత మహేష్ బాబు మహర్షి, హౌస్ ఫుల్ 4 అనంతరం ప్రభాస్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. 


దీనిపై మరింత చదవండి :