గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి చిచ్చిలి
Last Modified: శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:37 IST)

ఎన్టీఆర్ ఎక్కడ గుద్దేస్తాడోనని చాలా భయపడ్డాను... పూజా హెగ్డే

ఇటీవల ఎన్టీఆర్ నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ మూవీ అరవింద సమేత సినిమా విజయం సాధించింది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటించింది. తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న పూజకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ చిత్రాన్ని సంబంధించి కొంత భాగం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించడం జరిగింది. ఆ సందర్భంగా తాను, తారక్ కలిసి చెరువు పక్కన సైకిల్ తొక్కుతున్న వీడియోను పూజా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
సాధారణంగా సెట్‌లో ఎంతో చలాకీగా ఉండే తారక్ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడుపుతుంటారు. ఆ విధంగా సైకిల్ తొక్కుతున్నప్పుడు జరిగిన సరదా సంఘటనను కూడా పూజా పంచుకున్నారు. తామిద్దరూ చెరువు పక్కన సైకిల్ తొక్కుతుండగా తారక్ సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఫోటోగ్రాఫర్ ముందుకెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేసారు. ఎక్కడ ఆయనను గుద్దేస్తాడోనని చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది ఈ భామ. ఈ విజయం తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.