నాకు, ప్రభాస్‌కు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం: పూజా హెగ్డే
టాలీవుడ్ అగ్ర హీరోయిన్ పూజా హెగ్డే ప్రస్తుతం బాహుబలి స్టార్ ప్రభాస్‌తో జాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌పై పూజా హెగ్డే మాట్లాడుతూ.. యూరప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటిస్తున్నానని చెప్పింది. ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలను ఇటలీలో చిత్రీకరించడం జరిగింది.
ఈ సినిమాతో ప్రభాస్‌ను దగ్గరగా చూసే అవకాశం దక్కింది. ఆయన లాంటి మంచి మనిషిని ఇప్పటివరకూ చూడలేదు. తాను ఒక ఇంటర్నేషనల్ స్టార్ అనే విషయాన్ని పక్కన పెట్టేసి, చాలా కూల్‌గా తన పని తాను చేసుకు వెళుతుంటాడు. ఆయనకి, తనకు మటన్ బిర్యానీ అంటూ చాలా ఇష్టం. టైమ్ దొరికితే చాలు మటన్ బిర్యానీ మస్తుగా లాగించేస్తుంటామని పూజా హెగ్డే చెప్పుకొచ్చింది.
కాగా పూజా హెగ్డే టాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసుకుంటూ పోతోంది. ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన పూజా ఆపై వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవలే గద్దలకొండ గణేష్ సినిమాలో నటించి యూత్ ఆడియన్స్‌ని ఆకట్టుకున్న ఈ భామ వరుసపెట్టి స్టార్ హీరోల సరసన రొమాన్స్ చేసే ఛాన్సులు పట్టేస్తోంది. బన్నీ సరసన అల వైకుంఠ పురంలోను పూజానే హీరోయిన్ కావడం గమనార్హం.