'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌'తో పూజా హెగ్డే

pooja hegde
ఠాగూర్| Last Updated: బుధవారం, 16 సెప్టెంబరు 2020 (10:56 IST)
తెలుగులో వరుస హిట్లు సాధిస్తూ కెరీర్‌ను మూడు పువ్వులు, ఆరు కాయలుగా మలుచుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే. లాక్డౌన్ సమయంలో ఈ భామ పూర్తిగా ఇంటికే పరిమితమైపోయి.. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడిపింది. ఇపుడు అన్‌లాక్-4లో సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వడంతో అనేక మంది నిర్మాతలు ఆగిపోయిన తమ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ఒకటి. అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీవాసు, వాసువర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.

ఇపుడు ఈ చిత్రం షూటింగ్ ప్రారంభంకావడంతో ఈ అమ్మడు తన వ్యక్తిగత మేకప్ సిబ్బందితో కలిసి షూటింగ్ స్పాట్‌కు వచ్చింది. తాజాగా మంగళవారం నుంచి చిత్రబృందం తిరిగి షూటింగ్‌ను మొదలుపెట్టింది. హైదరాబాద్‌లో అఖిల్‌ అక్కినేని, పూజాహెగ్డేలపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. వ్యానిటీ వ్యాన్‌ ముందు నిల్చొని చిరునవ్వులు చిందిస్తున్న ఆన్‌లొకేషన్‌ స్టిల్‌ను సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో ఆమె షేర్ చేసుకుంది. పూజాహెగ్డే పోస్ట్‌ చేసిన ఈ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ పూర్తికానున్నట్లు సమాచారం.దీనిపై మరింత చదవండి :