శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 జూన్ 2020 (18:21 IST)

పూజా హెగ్డేకి విభూది రాసిన అల్లు అర్జున్.. వీడియో వైరల్ (Video)

DJ
2010వ సంవత్సరం మిస్ యూనివర్శ్‌ పోటీల్లో రెండో స్థానంలో నిలిచిన పూజా హెగ్డే.. తొలుత దక్షిణాదికి తమిళ ఇండస్ట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆపై బాలీవుడ్‌లో హృతిక్ రోషన్‌కు జోడీగా మొహంజదారో సినిమాల్లో నటించింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా ఫ్లాప్ కావడంతో ఆమెను అందరూ ఐరన్ లెగ్ అనుకున్నారు. అయితే తెలుగు సినీ ఇండస్ట్రీ ఆమెను గోల్డెన్ లెగ్‌గా మార్చేసింది. 
 
టాలీవుడ్‌లో ఆమె ప్రస్తుతం టాప్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.ఇటీవల అల వైకుంఠపురంలో సినిమా ద్వారా బంపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. ఈ సినిమాలోని పాటలన్నీ బంపర్ హిట్టే. బుట్టబొమ్మ పాట ద్వారా ప్రేక్షకులకు బాగా రీచ్ అయిన పూజా హెగ్డే ప్రస్తుతం బాహుబలి హీరో ప్రభాస్ సరసన నటిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే? కరోనా కారణంగా ప్రస్తుతం సెలెబ్రిటీలందరూ లాక్ డౌన్‌లో వున్నారు. 
 
ఈ నేపథ్యంలో పూజా హెగ్డే పాత ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ వస్తోంది. ఇలా దువ్వాడ జగన్నాథం చిత్రంలోని పాట షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోను పూజా పోస్టు చేసింది. ఆ ఫోటోలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పూజా హెగ్డేకు విభూది నుదుటన రాశాడు. ఈ ఫోటోలో ఇద్దరూ పంచెకట్టులో కనిపించారు. ఈ ఫోటో, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.